కరొనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి!
BJD MLA Pradeep Maharathy : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. రానురాను కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
coronavirus
BJD MLA Pradeep Maharathy : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. రానురాను కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కరోనా బారిన పడి ఒడిశాలోని ఓ ఎమ్మెల్యే మృతి చెందారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి(65) కరోనాతో ఈరోజు కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడటంతో సెప్టెంబర్ 14న నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే శుక్రవారం పరిస్థితి మరింతగా మించడంతో అయనకి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు.. ఈ క్రమంలో అయన ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం జనతా పార్టీ నుంచి 1985లో ప్రదీప్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనే గెలవడం విశేషం. నవీన్ పట్నాయక్ కేబినెట్‌లో వ్యవసాయ, పంచాయతీ రాజ్ మరియు మత్స్యశాఖ మంత్రిగా కూడా ప్రదీప్ పనిచేశారు. వ్యవసాయ రంగంలో అయన చేసిన కృషికి గాను 2016 లో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు, 2014-15 కృషి కర్మన్ అవార్డు లభించింది. అయన మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలుపుతున్నారు. ఇక ప్రదీప్ మహారథికు భార్య ప్రతివా మహారథి, కుమారుడు రుద్ర ప్రతాప్ మహారథి, కుమార్తె పల్లవి మహారథి ఉన్నారు. ప్రదీప్ అంత్యక్రియలు సోమవారం పూరి స్వర్గద్వార్‌లో జరగనున్నాయి..