Union Budget 2025: కేంద్ర బడ్జెట్.. బీహార్ కు వరాలు
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం తన 2025-26 బడ్జెట్ లో బీహర్ రాష్ట్రానికి నిధుల కేటాయించింది ప్రభుత్వం.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్.. బీహార్ కు వరాలు
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం తన 2025-26 బడ్జెట్ లో బీహర్ రాష్ట్రానికి నిధుల కేటాయించింది ప్రభుత్వం. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్ రాష్ట్రంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
బీహార్ లో ఏర్పాటు చేయనున్న సంస్థలు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సెంటర్
మఖానా బోర్డు
ఐదు ఐఐటీలలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఐఐటీ పాట్నా సెంటర్ ను విస్తరించనున్నారు.
బీహార్ లోని మిథిలాంచల్ లో 50 వేల హెక్టార్లకు చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ కు ఆర్ధిక సాయం
బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు
ప్రస్తుతం బీహార్ లో జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి టీడీపీ, జేడీయూ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. దీనికితోడు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున కేంద్ర ప్రభుత్వం బీహార్ పై ఫోకస్ చేసిందనే అభిప్రాయాలున్నాయి.