Viral Video: వరద ప్రభావిత ప్రాంతానికి ఎంపీ.. వీపుపై మోసుకెళ్లిన ప్రజలు..
Viral Video: భారీ వర్షాలతో బిహార్‌లోని కఠిహార్ జిల్లా అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ పర్యటించి వివాదాస్పదంగా మారాడు.
Viral Video: వరద ప్రభావిత ప్రాంతానికి ఎంపీ.. వీపుపై మోసుకెళ్లిన ప్రజలు..
Viral Video: భారీ వర్షాలతో బిహార్‌లోని కఠిహార్ జిల్లా అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ పర్యటించి వివాదాస్పదంగా మారాడు. వరద నీటిలో ఆయన దిగకుండా గ్రామస్థులు మోసుకెళ్లారు. దీనిపై రాజకీయ విమర్శలు రావడంతో.. కఠిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ స్పందించారు.
ఎంపీ అన్వర్‌కు ఆరోగ్యం బాగా లేదు కాబట్టే గ్రామస్థులు మోసుకెళ్లారన్నారు. మేము ట్రాక్టర్, బోటు, బైక్‌లపై గ్రామాల్లో పర్యటించాం. ఒకచోట బురద కారణంగా మేము ప్రయాణిస్తున్న ట్రక్ ఆగిపోయింది. ఆ సమయంలో ఎండ బాగా ఉండటంతో అన్వర్ అస్వస్థతకు గురయ్యారు. తల తిరుగుతోందని చెప్పడంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా.. ప్రేమతో ఆయనను ఎత్తుకొని మోసుకెళ్లారు అని వివరించారు.