Central Employees: కేంద్ర ఉద్యోగులకు పెద్ద రిలీఫ్.. ఆ విషయంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం..!

Central Employees: కేంద్ర ఉద్యోగులకు పెద్ద రిలీఫ్.. ఆ విషయంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం..!

Update: 2022-04-14 08:30 GMT

Central Employees: కేంద్ర ఉద్యోగులకు పెద్ద రిలీఫ్.. ఆ విషయంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం..!

Central Employees: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇళ్లను నిర్మించేందుకు బ్యాంకుల నుంచి తీసుకునే గృహ రుణం అంటే బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేటును తగ్గించింది. గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం కార్యాలయం మెమోరాండం జారీ చేసింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇల్లు కట్టుకోవడానికి లేదా ఫ్లాట్ కొనడానికి బ్యాంకుల నుంచి తీసుకున్న గృహ రుణాలను తిరిగి చెల్లించడానికి అడ్వాన్స్‌లు ఇస్తుంది. అలాంటి వాటిపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు లేదా 0.8 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వర్తిస్తుంది. అంటే ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలనే కలను మరింత సులభంగా సాకారం చేసుకోవచ్చు.

ప్రభుత్వం ఈ ప్రకటన తర్వాత ఉద్యోగులు 7.1 శాతం వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఈ రేటు వార్షికంగా 7.9 శాతంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఈ మేరకు గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అడ్వాన్స్ వడ్డీ రేట్ల తగ్గింపు గురించి తెలియజేసింది. ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక సదుపాయం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం ప్రకారం 34 నెలల వరకు లేదా గరిష్టంగా రూ.25 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల నిరంతర సర్వీసు ఉన్న తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం 1 అక్టోబర్ 2020 నుంచి ప్రారంభించారు.

ఇటీవల కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచిన సంగతి తెలిసిందే. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తంగా 34 శాతానికి పెరిగింది. డీఏ తర్వాత ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం ఇతర అలవెన్సులను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపు తర్వాత, హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందనే అంచనాలు కూడా పెరిగాయి. హెచ్‌ఆర్‌ఏ పనిచేసే నగరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. X, Y, Z నగరాలకు మూడు కేటగిరీలు ఉన్నాయి. 

Tags:    

Similar News