Delhi: నేడే భారత్ బంద్

Delhi:రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు నిరసన గా సీఏఐటీ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

Update: 2021-02-26 02:00 GMT

ఫైల్ ఇమేజ్


Delhi: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (Petrol, diesel rates, GST, CAIT, Bharat Bandh, Chakka JamPetrol, diesel rates, GST, CAIT, Bharat Bandh, Chakka JamPetrol, diesel rates, GST, CAIT, Bharat Bandh, Chakka Jam) దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నది. బంద్‌లో 40 వేల వర్తక సంఘాలకు చెందిన 8 కోట్ల మంది వ్యాపారులు, పలు కార్మిక సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు బంద్‌లో పాల్గొంటున్నాయి. అఖిల భారత రవాణ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది.

భారత్‌ బంద్‌లో భాగంగా చక్కాజామ్‌కు సీఏఐటీ పిలుపునిచ్చింది. 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని తెలిపింది. మందులు, నిత్యావసరాలకు బంద్‌ నుంచి మినహాయింపునిచ్చారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు ఒకేవిధంగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News