పశ్చిమ బెంగాల్ తన కుమార్తెనే కోరుకుంటోంది: ప్రశాంత్ కిషోర్

West Bengal: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

Update: 2021-03-02 01:55 GMT

ఫైల్ Image

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ కోసం పనిచేయడానికి ఎన్నికల వ్యక్తి ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో జరగబోయే ఎన్నికలను భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలకమైన యుద్ధమని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. అంతేకాదు బెంగాల్ కేవలం తన కూతురిని కోరుకుంటోంది అంటూ మమతా బెనర్జీని మాత్రమే బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని ప్రతిధ్వనింపజేసేలా ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ తన కుమార్తెనే కోరుకుంటోంది: ప్రశాంత్ కిషోర్

భారత దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఒక ముఖ్యమైన యుద్ధం జరుగుతోందని, అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతోందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇక బెంగాల్ ప్రజలు తమ సందేశంతో సిద్ధంగా ఉన్నారని, సరైన నిర్ణయం తీసుకొని, సరైన కార్డును చూపించడానికి రెడీగా ఉన్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బెంగాలీ లో ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ బెంగాల్ తన కుమార్తెను మాత్రమే కోరుకుంటుంది అంటూ మమతా బెనర్జీ రావాలని బెంగాల్ ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు గా పేర్కొన్నారు.

గతంలోనూ బీజేపీ నేతలకు పీకే సవాల్

ఈ సంవత్సరంలో ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా చేసిన మొదటి ట్వీట్ ఇది. ఇంతకుముందు డిసెంబర్ 21వ తేదీన పశ్చిమ బెంగాల్ లో బీజేపీ డబుల్ డిజిట్ కోసం తెగ కష్టపడుతుంది అంటూ, ఒకవేళ బీజేపీ డబుల్ డిజిట్ ను దాటి ఎక్కువ స్థానాలు సంపాదిస్తే తాను ట్విటర్ ను వదిలేస్తానని, బీజేపీ 200 సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ నేతలు తమ పదవులకు స్వస్తి పలుకుతారా అని ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.

ఎన్నికల షెడ్యూల్ రావటంతో మొదలైన ఎన్నికల వేడి

పశ్చిమ బెంగాల్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, మార్చి 27 మరియు ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరిగే ఇతర ఆరు తేదీలు ఏప్రిల్ 1, 6, 10, 17, 22 మరియు 26. మొత్తం 294 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతాయి మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి. దీంతో ఎన్నికల వేడి మొదలైంది .

8 విడతలపై సిఎం మమతా ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్ కు మాత్రం ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 294 నియోజకవర్గాల్లో ఉన్న పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఈసారి ఎలాగైనా పశ్చిమబెంగాల్ లో పాగా వేయాలని బిజెపి విఫలయత్నం చేస్తుంది. బీజేపీ వ్యూహాలను చిత్తు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News