Bengal: బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆందోళన

Bengal: ఎన్నికల అనంతరం బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2021-05-09 06:52 GMT

బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ (ఫైల్ ఇమేజ్)

Bengal: బెంగాల్ లో ఎన్నికల అనంతరం హింస చెలరేగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని దాని పై ఆ రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ లో తాజా పరిస్థితులతో బాటు ఎన్నికల ఫలితాల రోజున రాష్ట్రంలో జరిగిన హింసపై తనకు అధికారులు సమాచారమేదీ ఇవ్వలేదని గవర్నర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

శనివారం సాయంత్రం డీజీపీ వీరేంద్రను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను పిలిపించి ఆయన వివరాలు కోరారు. అయితే దురదృష్టవశాత్తూ వారు ఎలాంటి పేపర్ వర్క్ తో రాలేదని, ఇందుకు చాలా కలత చెందుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. డీజీపీ రిపోర్టులు గానీ కోల్ కతా పోలీస్ కమిషనర్ నివేదికను గానీ హోమ్ కార్యదర్శి పంపలేదని జగ దీప్ ధన్ కర్ వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల ఈ ఉదాసీన వైఖరి సముచితం కాదని ఆయన తన ట్వీట్స్లో పేర్కొన్నారు.

ఎన్నికల అనంతరం జరిగి న హింసలో వివిధ పార్టీలకు చెందిన 16 మంది కార్యకర్తలు మృతి చెందారని మమత ఇటీవల పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా మమత ప్రమాణ స్వీకారం చేసిన రోజున..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితికి ప్రయారిటీ ఇవ్వాలని గవర్నర్ కోరగా,, మమత దీన్ని కాదని కోవిడ్ అదుపునకు తీసుకోవలసిన చర్యలకు ప్రాధాన్యమిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమితో భరించలేని ఆ రాష్ట్ర నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News