Bank holiday: నేడు బ్యాంకులకు సెలవు? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే

Bank holiday: నేడు ఫిబ్రవరి 19,2025 నాడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. దీంతో మహారాష్ట్రలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

Update: 2025-02-19 00:49 GMT

Bank holiday today on Chhatrapati Shivaji Maharaj Jayanti

Bank holiday: నేడు ఫిబ్రవరి 19,2025 నాడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. దీంతో మహారాష్ట్రలో బ్యాంకులు బంద్ ఉంటాయి. అక్కడి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు నేడు మూసి ఉంటాయి. ఒకప్పటి మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆర్బిఐలోని హాలుడే నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఆ రాష్ట్రంలో బ్యాంకులకు ఈ సెలవు ఉంది. దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు మాత్రం తెరిచి ఉంటాయి. మహారాష్ట్రలో కూడా రాష్ట్రమంతా బ్యాంకులు బంద్ ఉండవు. ప్రధానంగా బెలాపూర్, ముంబై, నాగపూర్ నగరాల్లో బంద్ ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు ఆప్షనల్ హాలుడే వలే ఉంటుంది. అవి ఓపెన్ ఉండచ్చు. ఉండకపోవచ్చు.

మహారాష్ట్రలో శివజయంతి లేదా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిగా పిలుచుకునే నేడు ప్రభుత్వ సెలవు దినాన్ని పాటిస్తుంటారు. ఈ రోజు మరాఠాల మొదటి ఛత్రపతి, శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల్లో సెలవు ఉంటుంది.

Tags:    

Similar News