Online Task Scam: ఆన్‌లైన్ మోసం వల్ల బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య! నన్ను ఒకసారి హగ్ చేసుకోండి అంటూ సూసైడ్ నోట్
Online Task Scam: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలకు ఎంతోమంది బలైపోతున్న ఉదంతాలు చూస్తున్నాం. లక్షల డబ్బులు తెలియకుండానే విత్ డ్రా అయిపోతుండడంతో ఏం చేయాలో తెలియక చివరకు సైబర్ సెల్‌ను ఆశ్రయిస్తున్నారు.
Online Task Scam: ఆన్‌లైన్ మోసం వల్ల బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య! నన్ను ఒకసారి హగ్ చేసుకోండి అంటూ సూసైడ్ నోట్
Online Task Scam: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలకు ఎంతోమంది బలైపోతున్న ఉదంతాలు చూస్తున్నాం. లక్షల డబ్బులు తెలియకుండానే విత్ డ్రా అయిపోతుండడంతో ఏం చేయాలో తెలియక చివరకు సైబర్ సెల్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే గుజరాత్‌కు చెందిన ఒక బ్యాంక్ ఉద్యోగిని ఇలా మోసపోవడంతో ఏకంగా 28లక్షలు అప్పుల పాలైపోయింది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని ఒక ప్రయివేట్ బ్యాంక్‌లో 25ఏళ్ల భూమికా సొరాధియా అనే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. అయితే ఇటీవల ఆమె ఒక ఆన్ లైన్ మోసానికి గురవ్వడంతో అది తట్టుకోలేక, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్ అందరినీ ఇప్పుడు కంటతడి పెట్టిస్తుంది. నా శం చూడగానే ఒక్కసారి నన్ను హగ్ చేసుకోండి అంటూ తన అమ్మానాన్నలను కోరింది.
భూమిక సూసైడ్ నోట్‌లో మోసపోయిన సంస్థ పేరును కూడా ప్రస్తావించింది. పోలీసులు చేపట్టిన ప్రాధమిక విచారణ ప్రకారం చూస్తే.. భూమిక టెలిగ్రామ్ ఆధారిత ఆన్ లైన్ టాస్క్ స్కామ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 500 రూపాయల విలువైన పనులు చేస్తే 700 రూపాయల రాబడి ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ఒక గ్రూప్‌లో భూమిక చేరింది. అయితే మొదట్లో బానే వచ్చింది. చిన్న చిన్న బహుమతులు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టేలా ఆమెను ఆకర్షించారు. చివరకు రూ.28 లక్షల అప్పు అయ్యేలా చేశారు. అధిక లాభం ఇస్తామని ఆశ చూపి..ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఆమెను డైవర్ట్ చేశారు. అంతేకాదు ఆమెను నమ్మించడానికి ఇతర కస్టమర్లు పొందిన డబ్బును ఎరగా చూపించారు. నకిలీ రశీదులు కూడా ఇచ్చారు. పోలీసుల ధర్యాప్తులో టెలిగ్రామ్ ఐడి గుర్తింపు లభించింది. భూమిక కుటుంబం మోసగాళ్ల నుండి నిరంతరం మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, దీనికారణంగా ఆమె తీవ్రమైన చర్యకు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే భూమిక రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. తనకు 28 లక్షల అప్పు ఉంది. అది నేను తిరిగి చెల్లించలేను. అందుకే నేను ఈ చర్యకు పాల్బడుతున్నట్లు వెల్లడించింది. మీ ఇద్దరికీ మంచి జీవితాన్ని ప్లాన్ చేస్తున్నాను. కానీ అంతా తలకిందులైంది. ఈ అప్పు మొత్తం shine.com కంపెనీకి చెందుతుంది. వీలైతే నా మరణం తర్వాత ఆ డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించండి అంటూ ఆ నోట్‌లో పేర్కొంది. దీంతోపాటు తన పీఎఫ్ డబ్బులు వస్తాయని అవి ఖర్చుచేసుకోమని చెప్పింది. అంతేకాదు తన మృతదేహాన్ని చూసిన వెంటనే ఒక సారి కౌగిలించుకోమని, ఇది నా చివరి కోరిక తీర్చమంటూ భూమిక తన తల్లిదండ్రులను ఈ నోట్‌లో కోరింది. ఈ నోట్ ఆధారంగా చేసుకునే ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.