Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో యువకుడి హల్‌చల్‌.. నమాజ్‌ సమయంలో ఆలయంలోకి ప్రవేశం

Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Update: 2026-01-10 11:30 GMT

Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో యువకుడి హల్‌చల్‌.. నమాజ్‌ సమయంలో ఆలయంలోకి ప్రవేశం

Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్‌కు చెందిన అహ్మద్ షేక్ అనే యువకుడు ఆలయంలోకి ప్రవేశించి హల్‌చల్‌కు పాల్పడ్డాడు. సరిగ్గా నమాజ్‌ సమయానికి ఆలయ ప్రాంగణంలోకి చొరబడి అక్కడే నమాజ్‌ చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ విషయం గమనించిన ఆలయ సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, యువకుడు వినకుండా గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఇటీవల అయోధ్యతో పాటు పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మతపరమైన, సాంస్కృతిక పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా యువకుడు ఆలయంలోకి ప్రవేశించి ఇలా ప్రవర్తించాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News