తమిళనాడులో దారుణం.. 300 మంది రోగులను హత్య చేసిన ఓ వ్యక్తి

Tamil Nadu: పదేళ్లలో 300 మందిని చంపినట్లు చెప్పిన మోహన్ రాజు

Update: 2023-04-22 05:32 GMT

తమిళనాడులో దారుణం.. 300 మంది రోగులను హత్య చేసిన ఓ వ్యక్తి

Tamil Nadu: ఓ మనిషి ప్రాణం కళ్లెదుట పోతుంటేనే మన ప్రాణం అల్లాడుతుంది. అలాంటిది అసలే అనారోగ్యంతో మంచాన పడ్డ రోగిని చంపడం అంటే ఎంతటి దారుణమైన విషయమో చెప్పక్కర్లేదు. కానీ అలా రోగుల ప్రాణాలను క్యాషువల్‌గా తీసేశాడు ఓ వ్యక్తి. 5 వేల రూపాయలిస్తే చాలు.. పని కానిచ్చే్స్తానంటూ డీలింగ్స్ మాట్లాడుకుని బెడ్‌లో ఉన్న రోగులను హత్య చేశాడు. ఒకరిని ఇద్దరిని కాదు.. పదేళ్లలో ఇలా 3 వందల మందిని బలితీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జల్లా పళ్లిపాలయంలో చోటుచేసుకుంది. హత్యలకు పాల్పడిన వ్యక్తే ఈ విషయాన్ని చెప్పడం.. ఆ వీడియో వైరల్ అవడంతో ఈ హాస్పిటల్‌ మర్డర్‌ స్టోరీ వెలుగులోకి వచ్చింది.

పళ్లిపాలయం గ్రామానికి చెందిన మోహన్‌ రాజు రోజూ అక్కడి ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతూ ఉండేవాడు. అలా అక్కడి మార్చురీలో పనిచేసే వ్యక్తితో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత రోగులను చంపే హంతకుడిగా మారాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు.. లేక బంధువుల కోరిక మేరకు ప్రాణాలు తీసేవాడు. ఐదు వేల రూపాయలిస్తే చాలు.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేస్తానంటూ అతను చెప్తున్న ఓ వీడియో ఈనెల 18న బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇప్పటివరకు అతను 3 వందల మందిని హత్య చేసినట్లు తెలిపాడు మోహన్‌ రాజు.

మోహన్‌ రాజు వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులోనే తాను అలా మాట్లాడినట్లు చెబుతున్నాడు మోహన్ రాజు. ఇక ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు 18 మంది నకిలీ వైద్యులతో పాటు.. మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News