Arvind Kejriwal: కేజ్రీవాల్ సందేశం చదివి వినిపించిన ఆయన సతీమణి
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ ఆశ్చర్యపర్చలేదని ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ రాసిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత చదివి వినిపించారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ సందేశం చదివి వినిపించిన ఆయన సతీమణి
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ ఆశ్చర్యపర్చలేదని ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ రాసిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత చదివి వినిపించారు. తన జీవితంలోని ప్రతి క్షణం దేశానికే అంకితం అన్నారు. భవిష్యత్తులోనూ పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నట్టు ఆమె చెప్పారు. సమాజం కోసం మీ పని కొనసాగించండని... దేశాన్ని బలహీన పరిచే ఎన్నో శక్తులు ఉన్నాయన్నారు. జాగ్రత్తగా ఉండండి.. అలాంటి శక్తుల్ని గుర్తించి ఓడించండని పిలుపునిచ్చారు.