విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్.. ఆపరేషన్ లోటస్ విఫలమైందన్న కేజ్రీవాల్

Delhi: విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ సర్కార్ నెగ్గింది. కేజ్రీవాల్‌కు మద్ధతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.

Update: 2022-09-01 09:14 GMT

విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్.. ఆపరేషన్ లోటస్ విఫలమైందన్న కేజ్రీవాల్

Delhi: విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ సర్కార్ నెగ్గింది. కేజ్రీవాల్‌కు మద్ధతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. ఆపరేషన్ లోటస్ విఫలమైందని వ్యాఖ్యానించారు సీఎం కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ ఆరోపణ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ విశ్వాస పరీక్షకు సిద్ధమై తమ బలాన్ని నిరూపించుకుంది. సిసోడియాపై కేసుల నేపథ్యంలో కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయ‌డంలో కూడా బీజేపీ విజయం సాధించలేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. త‌మకు అసెబ్లీలో 62 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉండ‌గా, ఇద్ద‌రు విదేశాల్లో ఉన్నార‌ని, ఓ స‌భ్యుడు జైల్లో ఉన్నాడని అన్నారు. మ‌రో సభ్యుడు శాస‌న‌స‌భ స్పీక‌ర్ అని తెలిపారు.

Tags:    

Similar News