తెలంగాణలో అమిత్‌ షా పర్యటనకు ఏర్పాట్లు

Amit Shah: ఏప్రిల్ 10, 14వ తేదీల్లో అమిత్ షా టూర్ ఉండే ఛాన్స్

Update: 2022-03-29 09:57 GMT

తెలంగాణలో అమిత్‌ షా పర్యటనకు ఏర్పాట్లు

Amit Shah: కేంద్రహోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌కు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 10, 14వ తేదీల్లో ఏదో ఒకరోజు అమిత్‌షా పర్యటన ఉండేలా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రయత్నిస్తోంది. 10వ తేదీన అమిత్‌షా పర్యటన ఫిక్స్ అయితే శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రొగ్రామ్ షెడ్యూల్ రెడీ కానుంది. ఒకవేళ 14వ తేదీన తెలంగాణ పర్యటనకు అమిత్‌షా వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. అమిత్‌షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలకు రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. 

Tags:    

Similar News