మే 3న కరోనా వారియర్స్‌కు భారత త్రివిధ దళాల జేజేలు
కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పాత్ర ఎనలేనిది.
కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పాత్ర ఎనలేనిది.కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్ కు కృతజ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి.
కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం (మే 3) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ శుక్రవారం వెల్లడించారు కరోనా వారియర్స్‌కు ఘనంగా జేజేలు పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం దేశంలోని తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ తమ యుద్ధ నౌకలపై ప్రత్యేక దీపాలు వెలిగించనున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భారత నేవీ యుద్ధ విమానాలు కూడా పాల్పంచుకుంటాయని రావత్ తెలిపారు. ఒక్కో బృందంలో 6 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాప్ట్‌లు ఉంటాయన్నారు. ముఖ్యమైన నౌకలన్నింటినీ తీర ప్రాంతాల్లో మొహరించనున్నట్లు వెల్లడించారు. దిబ్రూగడ్ నుంచి కచ్ (గుజరాత్) వరకు ఓ బృందం, శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు ఒక బృందం ఎంపిక చేసిన ఆస్పత్రులపై పుష్పాలు కురిపిస్తూ.. సాగుతాయని బిపిన్ రావత్ తెలిపారు.
లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. కరోనాపై పోరు కోనసాగిస్తున్న డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి బిపిన్ రావత్ ధన్యవాదాలు తెలిపారు. వార్ మెమోరియల్, పోలీస్ మెమోరియళ్ల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుందన్నారు.