మహారాష్ట్రలో భారీ ఉగ్రకుట్ర..? బీచ్‌లో అనుమానాస్పద బోట్లు..

Harihareshwar Beach: మహారాష్ట్రలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

Update: 2022-08-18 10:44 GMT

మహారాష్ట్రలో భారీ ఉగ్రకుట్ర..? బీచ్‌లో అనుమానాస్పద బోట్లు.. 

Harihareshwar Beach: మహారాష్ట్రలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాయ్‌గఢ్‌లోని హరిహరేశ్వర్ బీచ్‌ దగ్గర అనుమానాస్పద స్థితిలో రెండు బోట్లు తీవ్ర కలకలం రేపాయి. సముద్ర జలాలపై తేలియాడుతున్న బోట్ల సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా అందులో మూడు ఏకే 47 ఆయుధాలతో పాటు మరికొన్ని బుల్లెట్లు కనిపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాయ్‌గఢ్‌ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

ఈ ఘటనతో గతంలో ముంబై తీరంలో 26 బై 11 రోజు జరిగిన ఉగ్రకుట్ర గుర్తుకు తెచ్చింది. దీంతో పరిస్థితిని కేంద్ర బలగాలు నిషితంగా పరిశీలిస్తున్నాయి. ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరివర్ధన ప్రాంతంలో పలువురు స్థానికులు ఈ పడవలను గుర్తించారు. బోటులో సిబ్బంది ఎవరూ లేరని తెలుసుకున్న స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అధికారులు అప్రమత్తమయ్యారు. రాయగఢ్ ఎస్పీ అశోక్ దూబే ఇతర సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని బోటును తమ అధీనంలోకి తీసుకొన్నారు.

దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పడవ లభించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీజ్ స్పందించారు. ఇది ఆస్ట్రేలియాకు చెందిన బోటు అని దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. 

Tags:    

Similar News