Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో అమెరికన్‌ అరెస్ట్‌.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సంచరిస్తున్న విదేశీ

Himachal Pradesh: కోర్టు అనుమతితో పోలీస్‌ కస్టడీకి విదేశీయుడు

Update: 2023-08-05 09:05 GMT

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో అమెరికన్‌ అరెస్ట్‌.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సంచరిస్తున్న విదేశీ

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ విదేశీయుడి అరెస్ట్‌ కలకలం రేపింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కొంత కాలంగా ధర్మశాలలో నివసిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వీసా, పాస్‌ పోర్ట్‌, గుర్తింపు పత్రాలు లేకుండా అమెరికాకు చెందిన వ్యక్తి ధర్మశాలలో నివసిస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అమెరికా దేశీయుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ధర్మశాల కోర్టులో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. పోలీసు విచారణలో సదరు వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన 28ఏళ్ల మైకా టైలర్‌గా తేలింది. బుద్దిజం ప్రాక్టీస్‌ చేసేందుకు 2021లో ఇండియాకు వచ్చాడు. అయితే తన పాస్‌పోర్ట్‌, వీసా ఇతర డాక్యుమెంట్లు ఉన్న బ్యాగ్‌ ఎక్కడో పోగొట్టుకున్నట్లు తేలింది.

Tags:    

Similar News