Amarnath Yatra: మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. శివలింగ దర్శనానికి తరలివెళ్లిన భక్తులు
Amarnath Yatra: పంజ్‌తరణి, శేష్‌నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు
Amarnath Yatra: మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. శివలింగ దర్శనానికి తరలివెళ్లిన భక్తులు
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్‌తరణి, శేష్‌నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో అమర్‌నాథ్ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసారు. పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు.
ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్‌నాథ్‌లో మంచు సైతం కురిసింది. నేటి నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.