Air Pollution: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ

Air Pollution: దీపావళి పండుగ ముగిసినా, దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వెంటాడుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసి, వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

Update: 2025-10-22 11:45 GMT

Air Pollution: దీపావళి పండుగ ముగిసినా, దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వెంటాడుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసి, వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 345గా నమోదైంది. అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో ఏక్యూఐ 380 దాటింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశను అమలు చేస్తున్నారు. నిపుణుల ప్రకారం, ఢిల్లీ కాలుష్యానికి కేవలం బాణసంచా మాత్రమే కారణం కాదు. వాహనాల పొగ 15.6 శాతం, పరిశ్రమలు మరియు ఇతర వనరులు 23.3 శాతం వరకు కారణమని డీఎస్ఎస్ నివేదిక వెల్లడించింది. పొగమంచు వల్ల కళ్ల మంటలు, శ్వాస సమస్యలు పెరిగి, ప్రజలు ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News