Coronavirus: రేపు స్వదేశానికి రానున్న వుహాన్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులు

Update: 2020-01-31 05:41 GMT
ఎయిర్ ఇండియా సిబ్బంది

కరోనావైరస్ కు నిలయంగా మారిన చైనాలోని వుహాన్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు భారత ప్రభుత్వం నడుం బింగించింది. భారతీయులను తరలించడానికి ఎయిర్ ఇండియా బోయింగ్ 747 శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరుతుంది. అలాగే జంబో జెట్ (విటి-ఇఎస్పి) "ఆగ్రా" ముంబై నుండి ఉదయం 9.01 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది, అక్కడ నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు వైద్యుల బృందంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మందులను తీసుకొని విమానం చైనాకు బయలుదేరనుంది.

ఢిల్లీ నుండి వెళ్లే విమానంలో 4 గురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బంది, ముగ్గురు ఇంజనీర్లు, ఐదుగురు వాణిజ్య సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ-మెన్ , ఒక డెస్పాచ్ అధికారి తో కలిపి మొత్తం 33 మంది ఉంటారని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ ప్రత్యేక విమాన పర్యవేక్షణ కోసం ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్ కెప్టెన్ అమితాబ్ సింగ్ విమానంలో ఉంటారని తెలిపింది. వుహాన్లో దిగే ముందు సిబ్బంది మొత్తం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. వుహాన్ నుండి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం రాత్రి రాత్రి 10 గంటలకు (స్థానిక సమయం) బయలుదేరి శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. హెడ్‌విండ్స్ కారణంగా అవుట్‌బౌండ్ ప్రయాణం కంటే వుహాన్ నుంచి ఢిల్లీకి అదనంగా 45 నిమిషాలు సమయం పడుతుంది.

కాగా కరోనావైరస్ వైరస్ బారిన పడి 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ దెబ్బకు వుహాన్ నగరాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఆ నగరంతోపాటు 13 నగరాలకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీంతో వుహాన్ నగరంలో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. చదువు కోసం వెళ్లిన వారు, ఉద్యోగాలు, శిక్షణ కోసం వెళ్లిన వారు అక్కడే ఉండిపోయారు. వీరంతా తమను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. ఆ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం.  



Tags:    

Similar News