Air India: విమానం సేప్‌గా ల్యాండ్‌ చేసిన వెంటనే పైలట్‌ మృతి.. ఎందుకో తెలుసా?

Air India Pilot Dead: ఏయిర్ ఇండియా విమాన సంస్థలో పనిచేస్తున్న ఓ యువ పైలట్ గుండెపోటుకు గురయ్యాడు. అయితే చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసి అతను ప్రాణాలు వదిలాడు.

Update: 2025-04-10 07:32 GMT

Air India: విమానం సేప్‌గా ల్యాండ్‌ చేసిన వెంటనే పైలట్‌ మృతి.. ఎందుకో తెలుసా?

Air India Pilot Dies of Heart Attack

Air India Pilot Dead: ఏయిర్‌ ఇండియాలో పని చేస్తున్న ఆర్మన్‌ (28) అనే యువ పైలట్‌ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడు. కానీ ప్రయాణికుల ప్రాణాన్ని రక్షించి తను తుదిశ్వాస విడిచాడు చాకచక్యంగా పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసి తీవ్ర అస్వస్థత గురైన అతడు ప్రాణాలు వదిలాడు.

ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న ఆర్మన్ శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన ఇతర స్టాఫ్ అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడు అని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అతను విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత డిస్పాచ్ ఆఫీస్ కి వెళ్లి తుది శ్వాస విడిచాడు. అంతకుముందే అతడు తీవ్రంగా వాంతులతో నీరసంగా ఉన్నాడని సహోద్యోగులు చెప్పారు. తమ కళ్ళ ముందే ఇదంతా జరగడంతో ఎయిర్ ఇండియా స్టాఫ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అంతేకాదు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ కూడా తీవ్ర విచారం వ్యక్త చేసింది. ఆర్మాన్‌ అతి చిన్న ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడంతో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి తమ సంస్థ సహకారాలు ఉంటాయని చెప్పింది.

ఇది ఇలా ఉండగా అతి చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. దీనికి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం అయితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా స్ట్రెస్ అధికంగా తీసుకోవడం కూడా మరో కారణం. ఎక్కువ గంటల పాటు పనిచేయడం కూడా గుండెపోటుకు దారితీస్తుంది. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌ వంటివి చేస్తూ ఉండాలి. ఈ మధ్య కాలంలో పనిగంటలు ఎక్కువగా పెరగడంతో ఒత్తిడి స్థాయిలు కూడా పెరిగిపోయి ఇలా ప్రాణాల మీదకు తెస్తుంది.

Tags:    

Similar News