Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో విమాన ప్రమదంలో మరో ట్విస్ట్.. దర్శకుడు మిస్సింగ్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది.

Update: 2025-06-16 05:34 GMT

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో విమాన ప్రమదంలో మరో ట్విస్ట్.. దర్శకుడు మిస్సింగ్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ మహేశ్ కళావడియా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించారు. మహేశ్ తనతో మట్లాడినప్పుడు ఈ ప్రమాదం జరిగన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నట్టు తెలిసింది.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిన కాసేపటికే ఒక మెడికో హాస్టల్‌పై పడి కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 253తో పాటు 29మంది మెడికోలు కూడా చనిపోయారు. అంతేకాదు ఈ విమానం హాస్టల్‌పై కూలిన సమయానికి అక్కడ చుట్టుపక్కలున్నవారు కూడా ఈ మంటలల్లో మాడిమసైపోయారు. సరిగ్గా ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ మహేశ్ కళావడియా కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహేశ్ కళావడియా అలియాస్ మహేశ్ జిరావాలా మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తున్నాడు. చిన్న చిన్న డాక్యుమెంటరీలు కూడా తీస్తుంటాడు. అయితే గత గురువారం మధ్యాహ్నం 1.30 ని.లకు విమానం ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న లా గార్డెన్‌కు ఒకరిని కలవడానికి వెళ్లినట్లు అతని భార్య చెప్పింది. అయితే అపుడు తనతో మాట్లాడినట్లు కూడా తెలిపింది. మీటింగ్ పూర్తియిందని, ఇంటికి తిరిగి వస్తున్నట్టు కూడా తన భర్త చెప్పారని ఆమె వెల్లడించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని జాడ తెలియ లేదని, ఫోన్ చేస్తుంటే అది పనిచేయడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహేశ్ భార్య చెప్పిన ప్రకారం చూస్తే విమానం ప్రమాదం జరిగిన సమాయానికే అతను పార్క్ లో ఉన్నట్టు స్పష్టమైంది. అలాగే అతను చేసిన చివరి ఫోన్ కాల్ లొకేషన్ కూడా విమానం కూలిన స్థలానికి 700 మీటర్ల దూరంలో ట్రేస్ అవుట్ అయింది. ఇక మహేశ్ డిఎన్ఎ ని తీసుకుని ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags: