Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పెరుగుతోన్న మృతులసంఖ్య.. 274మంది మృతిచెందారని పోలీలులు వెల్లడి
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241మంది ప్రయాణికులు చనిపోయారని, ఒకరు బతికి బయటపడ్డారని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పెరుగుతోన్న మృతులసంఖ్య.. 274మంది మృతిచెందారని పోలీలులు వెల్లడి
విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10మంది సిబ్బంది
ప్రయాణికుల్లో ప్రాణాలతో బయటపడ్డ ఒకేఒక్కడు విశ్వాస్
మిగిలినవారంతా మృతిచెందినట్లు నిర్ధారణ
మెడికో హాస్టల్‌పై విమానం కూలడంతో 10మంది మెడికోలు మృతి
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 24మంది మెడికోలు
మృతుల్లో మాజీ సిఎం విజయ్ రుపానీ
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241మంది ప్రయాణికులు చనిపోయారని, ఒకరు బతికి బయటపడ్డారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. విమానంలో ఉన్నవారు, నేలపైన ఉన్నవారితో కలిపి మొత్తంగా 274మంది ఈ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
అహ్మాదాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ విమానం మెడికో హాస్టల్‌పై కూలడంతో కొంతమంది మెడికోలు కూడా చనిపోయారు. అయితే ఇప్పటివరకు ఎంతమంది చనిపోయి ఉంటారన్న సంగతిపై ఎవరికీ స్పష్టత రాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికి 274 మంది చనిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయని వీరు హాప్పటిల్‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి. వీరిలో విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడితో పాటు కొంతమంది మెడికోలు, మరికొంత స్థానికులు ఉన్నారు.
ఈ ప్రమాదం జరిగే సమయానికి విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, పది మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయుడు విశ్వాస్ రమేష్ మాత్రమే బతికాడు. మిగిలిన 241 మంది చనిపోయారు. అలాగే ఈ విమానం ఒక మెడికో హాస్టల్‌పై పడడంతో అక్కడున్నవారిలో 10మంది మెడికోలు, వారి బంధువులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 24 మంది మెడికోలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.