ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇకనుంచి అసలు పని ప్రారంభం : ప్రధాని మోదీ

Update: 2020-02-13 04:53 GMT

గత ప్రభుత్వాలు దేశ పన్నుల వ్యవస్థను ముట్టుకోవడానికే భయపడ్డాయని.. తమ ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకొచ్చి టాక్సెస్ విధానాన్ని సరళతరం చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. దేశాభివృద్ధి కోసం పన్నులు సకాలంలో చెల్లించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్.. రాబోయే రోజుల్లో భారత ఆర్ధిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుందని అన్నారు.

అయితే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం లక్ష్యం అంత సులభం కాదన్న ఆయన.. అనుకుంటే అది సాధించలేనిది కాదన్నారు. 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి భారత్ 70 సంవత్సరాలు పట్టింది, కాని దీని గురించి ఎవరూ ప్రశ్నించలేదు. దిక్కులేనిదిగా ఉండడం కంటే కష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయడం మంచిది అభిప్రాయపడ్డారు. కేవలం ఎనిమిది నెలల్లో తమ ప్రభుత్వం 100 కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్న మోదీ, ఢిల్లీ లోని అనధికార కాలనీలను క్రమబద్ధీకరించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడం, ట్రిపుల్ తలాక్ నిషేధించడం, కార్పొరేట్ పన్నును తగ్గించడం, అయోధ్యలో రామమందిరం ట్రస్ట్ ఏర్పాటు చేయడంతోపాటు పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా భారతదేశం వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే, అసలు పని ఇకనుంచి ప్రారంభమవుతుంది" అని చెప్పారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంతేకాదు.. చాలా సవాళ్లను ఎదుర్కొంటుందనేది కూడా నిజం. చిన్న నగరాలు, పట్టణాల్లో ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం ఇదే మొదటిసారి అని అన్నారు. భారతదేశం ఇప్పుడు సమయాన్ని వృథా చేయదు, ఇది వేగం మరియు విశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. భారత్ ఏమాత్రం సమయాన్ని వృథా చేయదని.. వేగంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తుందని మోదీ జోశ్యం చెప్పారు. కొంతమంది వ్యక్తులు పన్నులు ఎగవేసేందుకు మార్గాలు కనుగొంటారని, నిజాయితీపరులకు జరిమానా విధించారని మోడీ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు.

పన్ను వ్యవస్థను తాకడానికి అన్ని ప్రభుత్వాలు సంకోచించాయి. కానీ తమ ప్రభుత్వం దీనిని పౌరులను కేంద్రీకృతం చేస్తున్నాము.. పన్ను చెల్లింపుదారుల హక్కులను స్పష్టంగా నిర్వచించే పారదర్శక పన్ను చెల్లింపుదారుల చార్టర్ ఉన్న అతి కొద్ది దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది. అలాగే పన్ను చెల్లింపుదారులకు భరోసా ఇస్తున్నాము ఇకనుంచి ఎటువంటి తప్పిదాలు జరగవు.. సకాలంలో పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News