అది తప్పే.. ఇకనుండి నేను తప్పకుండా మాస్క్‌ ధరిస్తా!

Narottam Mishra : కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కొందరు మాత్రం మాస్కులు పెట్టుకోకుండానే తిరుగుతున్నారు.

Update: 2020-09-24 13:26 GMT

Narottam Mishra

Narottam Mishra : కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కొందరు మాత్రం మాస్కులు పెట్టుకోకుండానే తిరుగుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాను మాస్కు ధరించలేదని మీడియా ప్రశ్నించగా.. 'నేను మాస్కు పెట్టుకోను.. ఏమౌతుంది' అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తాజాగా అయన పేద, వెనుక బడిన వర్గాలకు సహాయాన్ని అందించే సంబాల్ యోజన పంపిణీ కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అయన పలువురి ప్రాణాలను కాపాడిన ఇండోర్‌ పోలీసు సిబ్బందికి సన్మానం చేశారు. అంతేకాకుండా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఆయన మాస్క్‌ ధరించకపోవటంతో మంత్రిని పలువురు విలేకరులు ప్రశ్నించారు. అయితే దీనికి అయన స్పందిస్తూ.. 'నేను మాస్కు పెట్టుకోను.. ఏమౌతుంది' అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో ఇది పెద్ద చర్చకు దారీ తీసింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో.. అనారోగ్య సమస్యలతోనే మాస్కు పెట్టుకోవడం లేదని వివరణ ఇచ్చారు.. నేను మాస్క్‌ ధరించకపోవటం అన్నది చట్టవిరుద్ధమేనని, ఇక నుంచి మాస్క్ పెట్టుకుంటానని, అందరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు..

ఇక అటు మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో సుమారుగా 20,800కు పైగా కేసులు నమోదు కాగా.. 516 మంది మరణించారు. ఇదిలా ఉండగా ఇండోర్‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌ పరిధిలో మాస్కులు ధరించని వారికి రూ.200 జరిమానా విధించాలనే నిబంధన అమలులో ఉంది.


Tags:    

Similar News