ఇకనుంచి అబార్షన్‌కు 24 వారాల గడువు

Update: 2020-01-30 03:01 GMT
ఇకనుంచి అబార్షన్‌కు 24 వారాల గడువు

అబార్షన్‌ చేయించుకోవడానికి కోసం పరిమితిని 20 వారాల (5 నెలలు) నుండి 24 వారాలకు (6 నెలలు) పొడిగించాలని ప్రతిపాదించిన 2020 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర క్యాబినెట్ వివరాల ప్రకారం.. ఈ చట్టం అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకు ఉపయోగపడనుంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 కు సవరణగా కొత్తగా ప్రతిపాదించిన ఈ బిల్లు రానుంది.

జనవరి 31 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నిర్ణయం తీసుకున్న తరువాత ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గర్భ విచ్ఛిన్నానికి గరిష్ట గడువుని 20 వారాల నుంచి 24 వారాలకి పెంచడం వల్ల ఎందరో మహిళలకు బాగా సయపడుతుందని స్పష్టం చేశారు. చాలా మందితో చర్చించనిన తరువాతే ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు.

అత్యాచార బాధితులు, మైనర్లు గర్భం దాల్చినప్పటికీ చాలా ఆలస్యంగా గ్రహిస్తారని, అలాంటి వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని ఆయన చెప్పారు. అంతేకాదు సులువుగా గర్భస్రావం, మహిళల పునరుత్పత్తి హక్కుల్ని కాపాడినట్టు అవుతుందని అన్నారు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గర్భస్రావం నేరపూరితం . తల్లి ప్రాణానికి ప్రమాదం లేకుండా అబార్షన్‌ చేస్తే తల్లికి మరియు గర్భస్రావానికి ప్రోత్సహించిన వారికి శిక్షను అమలు చేస్తోంది. కానీ ఈ చట్టం సరిగా అమలు కావడం లేదు. ఆసుపత్రులలో యథేచ్ఛగా అబార్షన్లు జరుగుతూనే ఉన్నాయి. తల్లి ప్రాణానికి ప్రమాదం ఉండి, లేదా పిండం మనుగడ సాగించకపోతే మాత్రమే 20 వారాల తరువాత గర్భస్రావానికి అనుమతించబడుతుంది. దీనిని తాజాగా 24 వారాలకు పెంచారు.  

Tags:    

Similar News