కేజ్రీవాల్ నివాసంలో ఎమ్మెల్యేల భేటీ..!

Update: 2020-02-12 05:04 GMT

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం అవుతారని పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రాయ్ తెలిపారు. ఈ సందర్బంగా ఉదయం 11.30 గంటలకు జరగనున్న సమావేశంలో ఎమ్మెల్యేలు ఆప్ శాసనసభ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారని రాయ్ మంగళవారం పిటిఐకి తెలిపారు.

ఫిబ్రవరి 14 మరియు 16 తేదీలలో ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఈ కార్యక్రమానికి రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు మరో ఆప్ నాయకుడు చెప్పారు. ఈ వేడుకకు రాంలీలా మైదానాన్నిఅనుకుంటున్నట్టు చెప్పారు.

మరోవైపు వేదికకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆప్ సీనియర్ నాయకుడు తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకున్న తరువాత, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ముఖ్యమంత్రి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో 62 స్థానాలను గెలుచుకున్న ఆప్ మంగళవారం దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించింది. 

Tags:    

Similar News