Arvind Kejriwal: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్
Arvind Kejriwal: నన్ను ఆపేందుకు ప్రధాని మోడీ కుట్ర చేశారు
Arvind Kejriwal: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలోకి ఆప్ వచ్చిందని... అందుకే తనను ఆపాలని జైలుకు పంపారని ఆ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురుగ్రామ్‌లో ఆప్ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ టార్గెట్‌గా కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని... హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు. ఢిల్లీలో 500 క్లినిక్‌లు ఏర్పాటు చేశానని... దేశ వ్యాప్తంగా 5 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.