ఈ దున్న ఖరీదు రూ.25 కోట్లు.. నెలకు రూ.10 లక్షల సంపాదన..

Haryana Murrah Breed Buffalo: ఓ దున్నపోతు ప్రతి నెల ఉద్యోగి మాదిరి లక్షల ఆదాయం సంపాదిస్తోంది.

Update: 2023-04-13 09:45 GMT

ఈ దున్న ఖరీదు రూ.25 కోట్లు.. నెలకు రూ.10 లక్షల సంపాదన..

Haryana Murrah Breed Buffalo: ఓ దున్నపోతు ప్రతి నెల ఉద్యోగి మాదిరి లక్షల ఆదాయం సంపాదిస్తోంది. ఈ దున్న ధర అక్షరాలా రూ.25 కోట్లు. హర్యానాలోని పానిపట్ జిల్లా దిద్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు ఈ 'షెహన్‌షా' దున్నను పెంచి పోషిస్తున్నాడు. నరేంద్రసింగ్ పెంచుకునే ఈ దున్నపోతు వయస్సు పదేళ్లు. ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవుతో మాంచి బలిష్టంగా నల్లగా నిగనిగలాడిపోతుంటుంది 'షెహన్‌షా'. హరియాణాలో ఈ దున్నలను నల్ల బంగారం అని ముద్దుగా పిలుస్తుంటారు.

ముర్రాజాతికి చెందిన ఈ జాతి దున్నల వీర్యానికి దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ. 300 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దీనిని మార్కెట్లో అమ్ముతారు. అలా ప్రతినెలా దున్న వీర్యాన్నిఅమ్మటం ద్వారా నెలకు రూ. 9.60 లక్షల ఆదాయం లభిస్తోంది నరేంద్రసింగ్ కు. 'షెహన్‌షా' జీవనశైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నరేంద్రసింగ్‌ దీని కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కట్టించారు. ఈ దున్న వివిధ పోటీల్లోనూ విజేతగా నిలుస్తోంది. ఓ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది.

Tags:    

Similar News