ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం

Update: 2021-02-25 14:50 GMT

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర కలకలం

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. ఆ వాహనానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News