Corona Cases in India: దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది.

Update: 2021-06-12 04:36 GMT

Corona Cases in India: దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వరుసగా ఐదో రోజు రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువన నమోదు అవుతున్నాయి. గత 70 రోజుల్లో అతితక్కువ కేసులు నమోదు అయినట్టు కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19 లక్షలకు పైగా టెస్ట్ లు నిర్వహిస్తే అందులో 84వేల 332 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈనెలలో రెండో సారి దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల 93లక్షలు దాటింది. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకుని మరో లక్ష 21 వేల 311 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 2కోట్ల 79 లక్షలకు పైగా ఉన్నారు.

ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మృతుల సంఖ్య మాత్రం ఆగడం లేదు వారం రోజుల క్రితం మరణాలు తగ్గినట్టు అనిపించినా మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. రోజుకు నాలుగు వేల చొప్పున మృతులు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24గంటల్లో కరోనా సోకి 4 వేల మంది మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 3 లక్షల 67 వేల 81కి చేరింది. దేశ వ్యాప్తంగా 10 లక్షల 80 వేల యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసులు 10లక్షలకు పడిపోయాయి. మరోపక్క ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 25 కోట్ల మార్కుకు చేరింది.

Full View


Tags:    

Similar News