76th Constitution Day: ఢిల్లీ సంవిధాన్ సదన్‌ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ సభ

76th Constitution Day: ఇవాళ ఢిల్లీలోని సంవిధాన్ సదన్‌ సెంట్రల్ హాల్‌లో భారత రాజ్యంగా 76వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

Update: 2025-11-26 05:33 GMT

76th Constitution Day: ఢిల్లీ సంవిధాన్ సదన్‌ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ సభ

76th Constitution Day: ఇవాళ ఢిల్లీలోని సంవిధాన్ సదన్‌ సెంట్రల్ హాల్‌లో భారత రాజ్యంగా 76వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వం వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక, సామూహిక పఠనాన్ని నిర్వహిస్తారు.

తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి అనువదించిన రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

Tags:    

Similar News