Corona Cases in India: దేశంలో కొత్తగా 70,421 కరోనా కేసులు
Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
కరోనా(రెప్రెసెంటేషనల్ ఇమేజ్ )
Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 72 రోజుల తర్వాత దేశంలో అతితక్కువ కేసులు నమోదు కావడం ఇదే. గత 10రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతున్నా కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి వస్తున్నాయి.
భారత్ లో కొత్తగా 70వేల 421 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3వేల 921 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 19వేల 501 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 81లక్షల 62వేల 947 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9లక్షల 73వేల 158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 95లక్షల 10వేల 410కి చేరాయి.