India: దేశంలో అయిదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా

India: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది.

Update: 2021-04-20 12:08 GMT

India: దేశంలో అయిదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా

India: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ వేవ్‌ దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులతో పాటు కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతోంది.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు డోసుల వారీగా చేరుతున్నాయి. అయితే ఆ వ్యాక్సిన్లు సరిపోక చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకాపై అపోహలు తొలగి టీకా వేయించుకుందామనుకునేసరికి టీకాల స్టాక్ లేకపోవడంతో చాలామంది దిగాలు పడుతున్నారు. నిర్వాహకుల అవగాహనా లోపమో మరేమో తెలీదు కానీ వ్యాక్సిన్లు మాత్రం వృథా అవుతున్నాయి. వ్యాక్సిన్ ను సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లనే అది వృథాగా మారుతుందంటున్నారు నిపుణులు. సాధారణంగా టీకాలు ఉత్పత్తి కేంద్రం నుంచి లబ్ది దారునికి చేరేలోగా చేసే ప్రయాణం అంతటా ఒకే రకమైన ఉష్ణోగ్రతను మెయిన్ టెయిన్ చేయాలి. అన్ని చోట్లా ఇది పక్కాగా అమలు అవుతుందని అనుకోలేం. మన దేశంలో ఉన్న సిబ్బంది కొరత, అనుభవ రాహిత్యం, కొన్ని లాజిస్టికల్ ఇబ్బందుల వల్ల కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ వృథా అయింది. ఒకసారి వ్యాక్సిన్ సీసా ఓపెన్ చేస్తే దానిని పూర్తిగా వినియోగించేయాల్సిందే. నిల్వ పెట్టే వీలు లేదు. అయితే వ్యాక్సినేషన్ హ్యాండిల్ చేసే వారి అవగాహనా లోపం వల్ల వ్యాక్సిన్ డోసులు కొన్ని చోట్ల వృథా అయ్యాయని తేలింది.

దేశంలో అయిదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా అవుతోందని వెల్లడించింది ఆర్టీఐ. వ్యాక్సిన్ వేస్టేజ్ లో అగ్రస్థానంలో తమిళనాడు ఉందని పేర్కొంది. సప్లయ్ చేసిన టీకాల్లో 23 శాతం సిబ్బంది వృథా చేసినట్టు తెలిపింది. దాని తర్వాతి స్థానాల్లో తమిళనాడు, హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్టు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10కోట్ల 34 లక్షల వ్యాక్సిన్లు పంపిణీ చేయగా వాటిల్లో 44లక్షల 78వేల టీకాలు వేస్టేజ్‌ అయినట్టు ప్రకటించింది ఆర్టీఐ. ఇక వ్యాక్సిన్ వినియోగంలో ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. దాదాపు 8 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అసలు సింగిల్ డోస్ కూడా వేస్టేజ్ కాలేదు. జీరో వేస్టేజ్ జాబితాలో కేరళ,బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, గోవా, డామన్ డయ్యు, అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవులున్నాయి అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిందని ఆర్టీఐ సమాచారంలో తేలింది.

మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, యూపీ రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇంకోపక్క ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వెంటిలేటర్ల షార్టేజ్‌ ఉంది. 

Tags:    

Similar News