Corona Cases in India: భారత్‌లో కరోనా కలవరం

Corona Cases in India: కొత్తగా 3,37,704 కరోనా కేసులు

Update: 2022-01-22 05:42 GMT

 భారత్‌లో కరోనా కలవరం

Corona Cases in India: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇవాళ రోజువారీ కొవిడ్ కేసులు 3 లక్షలు దాటాయి. తాజాగా 3,37, 704 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 21 లక్షల 13 వేల 365 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేల 50కి చేరాయి. నిన్నటితో పోలిస్తే 3.69 శాతం పెరిగాయి ఒమిక్రాన్ కేసులు. ఇక దేశంలో ఇప్పటివరకు 161.16 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ చేశారు.

Tags:    

Similar News