దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases Updates: దేశంలో ప్రస్తుతం 16,980 యాక్టివ్ కేసులు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases Updates: దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3వేల 303 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క ఢిల్లీలోనే 13 వందల కేసులొచ్చాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయా రాష్ట్రాలు హెచ్చరిస్తున్నారు. ఇక కొవిడ్ మహమ్మారి నుంచి మరో 2వేల 563 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16వేల 980 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.74 శాతానికి తగ్గింది. నిన్న 39 మరణాలు సంభవించాయి. వాటిలో ఒక్క కేరళలోనే 39 మరణాలు చోటుచేసుకున్నాయి.