Corona Cases in India: దేశంలో కొత్తగా 2,76,110 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2021-05-20 04:10 GMT

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,57,72,330కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,76,110 కేసులు నమోదు కాగా, 3,874 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,69,077 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వీరిలో ఇప్పటి వరకు 2,87,122 మంది మరణించగా.. 2,23,55,440 మంది కోలుకున్నారు. దేశంలో 86.23 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 12.66 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.11 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,55,010. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11,66,090 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News