Uttarakhand: అలకనంద నది ఒడ్డున పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌.. 16 మంది దుర్మరణం, ఏడుగురికి గాయాలు

Uttarakhand: చమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు

Update: 2023-07-19 11:38 GMT

Uttarakhand: అలకనంద నది ఒడ్డున పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌.. 16 మంది దుర్మరణం, ఏడుగురికి గాయాలు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి గంగా ప్రాజెక్టు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి కరెంట్ ప్రవహించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విద్యుదాఘాతంతో కుప్పకూలిన 15 మందిలో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హోం గార్డులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

Tags:    

Similar News