ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం..

Update: 2020-02-13 02:46 GMT

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే మీద ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో 13 మంది మృతి చెందగా, 31 మంది గాయపడ్డారు. వారిలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్లీపర్ బస్సు ఢిల్లీ నుండి మోతీహరి (బీహార్) కు వెళుతోంది. ఫిరోజాబాద్‌ కు రాగానే డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుండి కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది దాంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మరణించారు.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ముగ్గురు మరణించారు. క్షతగాత్రులందరినీ సైఫాయి వైద్య కళాశాలకు తరలించారు. " ప్రమాదంలో 31 మంది గాయపడిన రోగులను ఆసుపత్రిలో చేర్పించారు.. 13 మంది చనిపోయారు" అని సైఫాయ్ వైద్య అధికారి డాక్టర్ విశ్వ దీపక్ చెప్పారు.

ఫిరోజాబాద్‌లోని నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) రాజేష్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లను అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాయపడినవారికి సరైన చికిత్స అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు లక్నోలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

Tags:    

Similar News