జగన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్.. ఏడాది పాలనపై టాలీవుడ్ డైరెక్టర్ వీడియో..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో పాదయాత్ర చేసి నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల మనసులు గెలుచుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Update: 2020-05-30 02:15 GMT
Mahi v raghav, YS jagan(File photo)

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో పాదయాత్ర చేసి నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల మనసులు గెలుచుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పూర్తిచేసి 151 సీట్లతో అఖండ విజయం సాధించింది. సరిగ్గా నేటికి జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా 'యాత్ర' సినిమా దర్శకుడు మహి వి. రాఘవ్ సీఎం జగన్ ఏడాది పాలనపై ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ ప్రత్యేక వీడియోను వైఎస్ జగన్‌కు అంకితం ఇచ్చారు.

ఈ ఏడాది కాలంలో సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమల్లోకి వచ్చిన పథకాలను ఈ వీడియోలో చూపించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణస్వీకారం చేసిన విజువల్‌తో ఈ వీడియోను మొదలు అవుతుంది.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనే నేను'.. ఆ తర్వాత ప్రతిపక్షాలు సీఎం జగన్ మతం గురించి ఆరోపణలు చేస్తుంటే.. ''ఈ మధ్యకాలంలో నా మతం, నా కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా'' అని బహిరంగ సభలో జగన్ చెప్పిన మాట వీడియోలో హైలైట్‌గా ఉంది. 'తొలి యేడు - జగనన్న తోడు' అనే క్యాప్షన్‌తో వీడియోను ముగించారు. అంతేకాదు, ఏడాది పాలనలో మేనిఫెస్టో చెప్పిన 90 శాతం పైగా హామీలు అమలయ్యాయని చూపించారు. నవరత్నాలు అమలు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని వీడియోలో చూపించారు.

మొత్తం మీద ఈ వీడియో వైసీపీ శ్రేణులకు అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపే వీడియో. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలకు నేను ఉన్నాను, నేను విన్నాను అని జగన్ చెప్పిన మాటలు కూడా మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ చిత్రం యాత్ర సినిమాలో ఉన్నవి కావడం విశేషం.



Tags:    

Similar News