Trisha: త్రిష సంచలన నిర్ణయం? సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి?

Update: 2025-01-25 13:14 GMT

త్రిష సంచలన నిర్ణయం? సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి?

Trisha to join Vijay political party?: సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని ఏలిన నటీమణుల్లో అందాల తార త్రిష ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందం, స్టార్‌డమ్‌తో దూసుకుపోతోందీ బ్యూటీ. మొన్నటికి మొన్న పొన్నియన్‌ సెల్వన్‌తో తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. ఒకప్పుడు తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన త్రిష ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైంది.

తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ చెరగని అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. కాగా త్రిష చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభర మూవీలో త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక తమిళంలో దళపతి విజయ్‌ 69 మూవీతో పాటు, అజిత్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇలా ఇన్నేళ్లయినా వరుస అవకాశాలను దక్కించుకోవడం త్రిషకే దక్కింది.

ఇదిలా ఉంటే త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే త్రిష సినిమాలకు గుడ్‌ బై చెప్పనుందని గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమాలకు ఫుల్‌‌స్టాప్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్న త్రిష పొలిటికల్ పార్టీలో చేరాలని ఆలోచిస్తోందని సమాచారం. విజయ్‌ పెట్టిన పార్టీలో త్రిష చేరే అవకాశాలు ఉన్నాయని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అయితే దీనిపై త్రిష ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్‌ మీడియాతో పాటు కోలీవుడ్‌ మీడియాలో మాత్రం ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వార్తలు కొట్టి పారేస్తున్నారు. త్రిష సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోదంటూ స్పందిస్తున్నారు. ఒకవేళ పార్టీలో చేరినా సినిమాలకు కొనసాగిస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News