Bheemla Nayak: ఎవరీ జానపద కళాకారుడు?

Bheemla Nayak: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Update: 2021-09-02 15:48 GMT

Bheemla Nayak: ఎవరీ జానపద కళాకారుడు?

Bheemla Nayak: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జానపద కథలనే నమ్ముకుని ఆ కళకు ప్రాణం పోస్తున్నాడు. 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో గ్రామ గ్రామాన తిరుగుతూ కిన్నెర వాయిస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. 12 మెట్ల కిన్నెర వాయించే వ్యక్తులు ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరూ లేరనే చెప్పాలి. దీంతో గతంలో తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. మొగులయ్య ' భీమ్లా నాయక్ ' సినిమాలో టైటిల్ సాంగ్ లో ప్రారంభంలో వచ్చే సాకీని అద్భుతంగా ఆలపించాడు. ఆ పాటకు మరింత వన్నె తెచ్చాడు. ఇప్పటికైనా ఆయనకు సరైన గుర్తింపు వచ్చిందని సంబరపడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు.

Full View



Tags:    

Similar News