Saif Ali Khan: ఆ ఆటో డ్రైవర్‌కి సైఫ్‌ ఏం బహుమతి ఇచ్చారు.? ఆయన మాటల్లోనే..!

Saif Ali Khan: బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-24 10:04 GMT

Saif Ali Khan: బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భద్రత నడుమ ఉండే సైఫ్‌ ఇంటిలోకి ఓ దొంగ దూరి కత్తితో దాడి చేశాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే వేల కోట్లకు అధిపతి అయిన సైఫ్‌ అలీఖాన్‌ దాడికి గురైన తర్వాత ఆసుపత్రికి ఆటోలో వెళ్లిన విషయం తెలిసిందే. గ్యారేజ్‌లో ఉన్న కార్లు బయటకు తీయడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతో సైఫ్‌ను స్థానికంగా ఉన్న ఓ ఆటోలో ఆసుపత్రికి తరలించారు.

చాకచక్యంగా స్పందించిన ఆటో డ్రైవర్‌ షార్ట్‌ కట్‌ రూట్స్‌లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో ఆసుపత్రికి చేరడంతో సైఫ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉంటే తాజాగా సైఫ్‌ అలీఖాన్‌ తన ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను కలిశాడు. సైఫ్‌ ఆటో డ్రైవర్‌కు కొంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని కూడా అందించాడు. అయితే ఆ ఆర్థిక సహాయం ఎంత అనేది చెప్పడానికి నిరాకరించాడు. సైఫ్ అలీ ఖాన్ కి ఇచ్చిన మాట నిలబెడతాను, బహుమతి మొత్తం వెల్లడించను అని డ్రైవర్‌ భజన్ సింగ్ రాణా తెలిపారు.

జనవరి 21వ తేదీ తర్వాత సైఫ్ ఆటో డ్రైవర్‌కు బహుమతి అందించారు. అయితే ఆ బహుమతికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది వారిద్దరి మధ్య వ్యక్తిగతమైనదని తెలిపారు. అయితే సైఫ్ అలీ ఖాన్ నుండి ఆటోరిక్షాను బహుమతిగా తీసుకుంటారా అని అడగ్గా.. తాను అది అడగలేదని కానీ ఇస్తే మాత్రం తీసుకుంటాననని చెప్పుకొచ్చారు.

అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం ప్రకారం డ్రైవర్‌ భజన్‌ సింగ్‌ రాణాకు సైఫ్‌ సుమారు రూ. 50,000 బహుమతి ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై స్పందించడానికి మాత్రం రాణా అంగీకరించలేదు. సైఫ్‌ ఇచ్చిన బహుమతి ఏంటి అనేది తమ ఇద్దరి మధ్య ఉంటుందని చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News