Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి..అసలు నిందితుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి..అసలు నిందితుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు
x
Highlights

Saif Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని అరెస్టు చేశారు ముంబై పోలీసులు. శనివారం అర్థరాత్రి థానేలో నిందితుడు...

Saif Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని అరెస్టు చేశారు ముంబై పోలీసులు. శనివారం అర్థరాత్రి థానేలో నిందితుడు విజయ్ దాస్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు మహమ్మద్ అలియాస్ బీజే అని పోలీసులు తెలిపారు. ముంబైలోని పబ్ లో విజయ్ దాసే అనే పేరుతో పనిచేస్తున్నాడని తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున థానేలోని హరినందాని ఎస్టేట్ సమీపంలోని మెట్రో నిర్మానం చేస్తున్న కార్మికుల క్యాంపులో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9గంటలకు ముంబై డీసీపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహిస్తామని..నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. కాగా శనివారం ఛత్తీస్ గఢ్ లో అరెస్టుచేసిన అనుమానితుడు కైలాశ్ నిందితుడు కాదని పోలీసులు పేర్కొన్నారు.

కాగా సైఫ్ అలీఖాన్ నివాసంలోకి ప్రవేశించి అతనిపై దాడి చేసింది తానేనని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని బాంద్రాకు తరలిస్తున్నామని..తర్వాత విచారిస్తామని పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం కోర్టులో హజరుపరిచి రిమాండ్ కోరుతామని వెల్లడించారు. కాగా అతని వద్ద భారతీయుడిగా ఉన్న ధ్రువీకరణ పత్రం ఫేక్ అని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే నిందితుడు భారతీయుడా లేడా బంగ్లాదేశీయా అని ఆరాతీస్తున్నారు.

కాగా ఈ కేసులో శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు సైఫ్ భార్య కరీనా కపూర్. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని..అక్కడ నగలు ఉన్నా వాటిని ముట్టుకోలేదని తెలిపారు. ఇక ఇప్పటి వరకు సైఫ్ మెడికల్ బిల్లు సుమారు 40లక్షలు అయ్యిందని సమాచారం. అందులో 25లక్షల రూపాయలు క్లెయిమ్ ను ఆమోదించినట్లు వైద్య ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories