Jr NTR: ‘వార్ 2’ కొత్త పోస్ట‌ర్ షేర్ చేసిన తార‌క్

War 2: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ ఇప్పుడు దేశవ్యాప్తంగా హైప్‌ను సృష్టిస్తోంది.

Update: 2025-07-16 10:24 GMT

War 2: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ ఇప్పుడు దేశవ్యాప్తంగా హైప్‌ను సృష్టిస్తోంది. 2019లో విడుదలై భారీ హిట్ సాధించిన ‘వార్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోందని ఇప్పటికే స్పష్టమైంది.

ఈ సీక్వెల్‌లో హృతిక్ రోషన్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనున్నారు. మిగతా కథా వివరాలు బయటకు రాకపోయినా, ఎన్టీఆర్ ఈ సినిమంలో విలన్‌ గానే కాకుండా, కథనానికి ఊహించని మలుపు ఇచ్చే కీలక పాత్రలో కనిపించనున్నట్టు సినీ వర్గాల సమాచారం.

ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదలకు మరో 30 రోజులు మాత్రమే ఉండటంతో, మేకర్స్‌ తాజాగా కౌంట్‌డౌన్ పోస్టర్ ను విడుదల చేసి ప్రమోషన్ మొదలు పెట్టారు. ఈ పోస్టర్‌ను ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (మాజీ Twitter) లో షేర్ చేయగా, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

‘వార్ 2’కి అయాన్ ముఖర్జీ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామర్‌కు తారకంగా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు.

హృతిక్, ఎన్టీఆర్ మధ్య కన్‌ఫ్రంటేషన్, హైఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లు, ఇంటెన్స్ డ్రామాతో కూడిన కథనం సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. భారతీయ స్పై యూనివర్స్‌లో ‘వార్ 2’కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి స్క్రీన్‌పై తలపడనున్నారు అనగానే హైప్ మరింత పెరుగుతోంది. 'వార్ 2' సినిమా బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే స్పై యాక్షన్ బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతున్నది అనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News