War 2: ఆకాశంలో 'వార్ 2' సందడి.. జనాలకు షాక్!

War 2: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార్ 2 ఒకటి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు.

Update: 2025-07-25 04:11 GMT

War 2: ఆకాశంలో 'వార్ 2' సందడి.. జనాలకు షాక్!

War 2: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార్ 2 ఒకటి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమా అంగరంగ వైభవంగా విడుదల కానుంది. దాని కోసం ఇప్పుడు నుంచే ప్రచారం వేగవంతం చేశారు. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా 'వార్ 2' ప్రచారం ప్రారంభమైంది. నేల మీద మాత్రమే కాదు, ఆకాశంలో కూడా 'వార్ 2' సందడి చేస్తోంది.

విమానాలను ఉపయోగించి ఆకాశంలో 'వార్ 2' అని రాశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రచారం గురించి అక్కడి ప్రజలకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచేందుకు ఆకాశంలో 'వార్ 2' అని రాసారు. దీన్ని చూసిన పౌరులందరూ ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆశ్చర్యంతో చూడడం మొదలుపెట్టారు.


Full View


ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు పెరిగిపోయాయి. గాజా, ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో యుద్ధాలు ప్రజల జీవితాలను నాశనం చేశాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ భయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ముందస్తు సూచన లేకుండా ఆకాశంలో 'వార్ 2' అని ప్రకటిస్తే ప్రజలు భయపడటం సహజమే కదా.

మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న చాలా మందికి 'వార్ 2' సినిమా గురించి తెలియదు. అందుకే ఆకాశంలో 'వార్' అనే పదం కనిపించగానే చాలా మంది భయపడ్డారు. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో వెతకగా, ఇది ఒక బాలీవుడ్ సినిమా ప్రచారం అని వారికి తెలిసింది. ఈ విషయం గురించి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమాకు దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో, అతని అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News