VV Vinayak: రాజమౌళి కి షాక్ ఇస్తున్న వి వి వినాయక్

VV Vinayak: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో విడుదలైన చత్రపతి సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే...

Update: 2022-01-09 07:24 GMT

VV Vinayak: రాజమౌళి కి షాక్ ఇస్తున్న వి వి వినాయక్

VV Vinayak: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో విడుదలైన చత్రపతి సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వి వి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చత్రపతి సినిమా కి కథని అందించిన విజయేంద్రప్రసాద్ హిందీ ప్రేక్షకులకి కూడా నచ్చే విధంగా స్క్రిప్టుని మలిచారు.

అయితే తాజా సమాచారం ప్రకారం వి.వి.వినాయక్ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాలలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలను తగ్గించి సెంటిమెంట్ సీన్ లను ఎక్కువగా హైలెట్ అయ్యే లాగా ప్లాన్ చేస్తున్నారు వి.వి.వినాయక్. నిజానికి తెలుగులో సినిమా హిట్ అవడానికి గల ముఖ్య కారణాలు రాజమౌళి టేకింగ్ కూడా ఒకటి.

కానీ ఇప్పుడు ఈ కథలో మార్పులు కూడా చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తే చిత్ర ఫలితం ఎలా ఉంటుందో అని తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే. మరోవైపు బాలీవుడ్ నుంచి కొన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం బాలీవుడ్ వైపు దృష్టి పెట్టడం లేదు.

Tags:    

Similar News