SS Rajamouli: విజువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరిచిన రాజమౌళి

SS Rajamouli: విజువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరిచిన రాజమౌళి

Update: 2022-03-28 16:30 GMT

విజువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరిచిన రాజమౌళి

SS Rajamouli: విజువల్ ఎఫెక్ట్స్ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు అయినా ఈజీగా తీసేస్తున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా జంతువులతో ఏమైనా సన్నివేశాలు ఉన్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ జంతువుల సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ బాగోకపోతే అవి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకూ సినిమాల్లో అదే జరిగింది. కానీ హాలీవుడ్ సినిమాల్లో మాత్రం మంచి టెక్నాలజీ వాడి అది నిజంగానే జంతువు అని తలపించే లాగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

తెలుగులో బాహుబలి సినిమాలో రానా మరియు ఎద్దు తో ఉండే సన్నివేశం మిగతా సినిమాలతో పోలిస్తే బాగానే అనిపించినప్పటికీ హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే చీప్ క్వాలిటీ లాగానే అనిపిస్తుంది. కానీ తాజాగా ఇప్పుడు "అర్ ఆర్ ఆర్" సినిమా తో రాజమౌళి అభిమానులను అబ్బురపరిచారు. ఎన్టీఆర్ మరియు పులి మధ్య ఉండే సన్నివేశం చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇక ఇంటర్వల్ సన్నివేశం సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఎక్కువైనప్పటికీ రాజమౌళి సినిమాలో హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ను వాడటంతో అభిమానులు జగనన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News