Vijayashanthi 40 years : లేడి సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 40 ఏళ్ళు!
Vijayashanthi 40 years : లేడి సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు సంపాదించుకున్నారు నటి విజయశాంతి.. ఆమె నటించిన మొదటి చిత్రం కిలాడీ కృష్ణుడు
Vijayashanthi
Vijayashanthi 40 years : లేడి సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు సంపాదించుకున్నారు నటి విజయశాంతి.. ఆమె నటించిన మొదటి చిత్రం కిలాడీ కృష్ణుడు విడుదలై నేటికి (సెప్టెంబర్ 12) కి 40 ఏళ్ళు అవుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించారు. 1980లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక తన సినీ ప్రస్థానానికి 40 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విజయశాంతి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టారు.
"నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అందించిన అభిమానులకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు" అని విజయశాంతి పోస్ట్ చేశారు.
ఇక ఈ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విజయశాంతి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమా తరవాత సినిమాలను అపెసీ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. తాజాగా ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో భారతి అనే పాత్రలో నటించి మెప్పించారు. ఇంకా ఆమె ఏ కొత్త సినిమాకి కూడా ఒప్పుకోలేదు..