Venkatesh: నా కెరీర్లో ఎక్కువ కష్టపడ్డ చిత్రం "నారప్ప"

Update: 2021-07-18 08:55 GMT

వెంకటేష్ (ఫైల్ ఫోటో )

Venkatesh:"కలియుగ పాండవులు" సినిమాతో హీరోగా పరిచయమైన వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో రకాల పాత్రలను పోషించి హీరోగా స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా తను నటించిన తమిళ రీమేక్ "నారప్ప" చిత్రంతో ఓటీటీలో జూలై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్ కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నాడు. తన కెరీర్లో నటించిన అన్ని చిత్రాల కంటే "నారప్ప"లో తన పాత్ర చేయడానికి చాలానే కష్టపడ్డానని, మొదటి రోజు షూటింగ్ పూర్తయ్యాక రెండవ రోజు షూటింగ్ వెళ్ళడానికి కూడా చేయడానికి చాలా కష్టం అయ్యేదని చెప్పుకొచ్చాడు. నారప్ప క్యారెక్టర్ లోని డ్రెస్ లోనే దాదాపుగా 50 రోజులు ఉన్నానని, అటు షూటింగ్ తోపాటు హోటల్ రూమ్ లో కూడా అదే కాస్ట్యూమ్ తోనే ఉన్నానని వెంకటేష్ తెలిపాడు.

"ఎఫ్ 2" చిత్రం వంటి కామెడీ సినిమా తర్వాత నారప్ప లో తన క్యారెక్టర్ ని నిజంగా ఛాలెంజ్ గా తీసుకొని చేశానన్నాడు. ఇక ఈ చిత్రాన్ని సినిమా థియేటర్స్ లో విడుదల చేయలేకపోతున్నందుకు అభిమానులు క్షమించాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల చేయడమే ఉత్తమం అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఇక అటు "దృశ్యం-2" చిత్రాన్ని సింగల్ షెడ్యుల్ లో పూర్తి చేసుకొని "ఎఫ్-3" సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News